Sachin Tendulkar: వరల్డ్ కప్‌లో ఓటమిపాలైన ఉమెన్ క్రికెట్ టీమ్.. స్పందించిన సచిన్..

Sachin Tendulkar: వరల్డ్ కప్‌లో ఓటమిపాలైన ఉమెన్ క్రికెట్ టీమ్.. స్పందించిన సచిన్..
Sachin Tendulkar: ఇక ఐసీసీ వరల్డ్ కప్‌లో ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఓటమిపాలైన ఒకరోజు తర్వాత సచిన్ కూడా దీనిపై స్పందించాడు.

Sachin Tendulkar: క్రికెట్ అనేది స్పోర్ట్స్ లవర్స్‌కు ఒక ఎమోషన్. కానీ అందులోనూ మెన్ క్రికెట్ టీమ్‌కు ఉన్నంత ఆదరణ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు ఉండదు. ఇప్పుడిప్పుడే ఉమెన్ క్రికెట్ టీమ్ కూడా తమ ప్రతిభతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది. తాజాగా వరల్డ్ కప్ చివరి ఘట్టం వరకు చేరుకున్న ఉమెన్ క్రికెట్ టీమ్ కప్ గెలవలేక వెనుదిరిగింది. తాజాగా సచిన్ టెండుల్కర్ దీనిపై స్పందించాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2022లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో ఉమెన్ క్రికెట్ టీమ్ ఓడిపోవడంతో చివరివరకు చేరలేకపోయింది. దీంతో టీమ్ సభ్యులు చాలా నిరాశకు లోనయ్యారు. దీంతో మెన్ క్రికెట్ టీమ్ దిగ్గజాలు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తూ.. క్రీడాకారిణిలకు ధైర్యం చెప్తున్నారు. 'గెలవాలనుకున్న టోర్నమెంట్ ఓడిపోయి వెనుదిరిగితే బాధగానే ఉంటుంది కానీ మీ ఉమెన్స్ టీమ్ తల ఎత్తుకొని ఉండొచ్చు. మీ వల్ల అయ్యిందంతా మీరు చేశారు. మేము మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం' అని ట్వీట్ చేశారు విరాట్.

ఇక ఐసీసీ వరల్డ్ కప్‌లో ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఓటమిపాలైన ఒకరోజు తర్వాత సచిన్ కూడా దీనిపై స్పందించాడు. 'మీరు మీ బెస్ట్ ఇచ్చారని, మీరు చేయదగినది అంతా చేశారని మాకు తెలుసు. మేము మిమ్మల్ని ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాము'. అని ట్వీట్ చేశాడు సచిన్. వరల్డ్ కప్‌లో ఓడిపోయి దు:ఖంలో ఉన్న ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు మెన్స్ క్రికెట్ టీమ్ సపోర్ట్ ఇవ్వడం చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది అనుకుంటున్నారు క్రికెట్ లవర్స్.

Tags

Next Story