Sakibul Gani: రంజీ చరిత్రలోనే కొత్త రికార్డు.. మొదటి ఆటలోనే ట్రిపుల్ సెంచరీ..

Sakibul Gani (tv5news.in)
Sakibul Gani: కేవలం ఇండియన్ క్రికెట్ టీమ్‌లోనే కాదు మొత్తం ఇండియాలోనే మనకు తెలియని టాలెంటెడ్ క్రికెటర్స్ ఎంతోమంది ఉంటారు. అందులో చాలామందికి వారి టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం రాక వెనకబడిపోతారు. కానీ ఒక్కసారి ఆ అవకాశం వచ్చిందంటే వారేంటో క్రికెట్ వరల్డ్‌కు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు బిహార్‌కు చెందిన షకీబుల్ గని గురించి కూడా క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది.
పేరున్న ఆటగాళ్లే డబుల్ సెంచరీలు చేయడానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇక ట్రిపుల్ సెంచరీ అనే మాటను ఎప్పుడో ఒకసారి వినడమే. అలాంటిది షకీబుల్ తన మొదటి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం కోలకత్తాలో రంజీ ట్రాఫీ పోటీలు నడుస్తున్నాయి. అయితే తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న షకీబుల్ రంజీ చరిత్రలోనే కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాడు.
మిజోరమ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ గని ట్రిపుల్ సెంచరీ చేశాడు. 405 బంతుల్లో 341 పరుగులు తీశాడు. అంతే కాకుండా స్ట్రైక్ రేట్ కూడా 84.20 మెయింటేయిన్ చేశాడు. ఇది చూసిన వారంతా షకీబుల్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 2018లో మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ రెహోరా తన డెబ్యూ మ్యాచ్‌లో 267 పరుగులు చేసి రికార్డు సాధించగా ఇప్పుడు ఆ రికార్డులు షకీబుల్ తిరగరాశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com