సెహ్వాగ్‌ శీర్షాసనం.. ఓజా వృక్షాసనం

సెహ్వాగ్‌ శీర్షాసనం.. ఓజా వృక్షాసనం
శీర్షాసనం వేస్తూ వీరేంద్ర సెహ్వాగ్‌, వృక్షాసనం వేస్తూ ప్రజ్ఞాన్‌ ఓజా... ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత మాజీ స్టార్‌ క్రికెటర్లు తమదైన రీతిలో జరుపుకున్నారు. మాజీ స్టార్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్నర్‌ ప్రజ్ఞాన్ ఓజా యోగాసనాలు వేస్తూ వీడియోలను పోస్ట్‌ చేసి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శీర్షాసనం వేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సెహ్వాగ్‌.... మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు యోగా ఎంతో ఉపకారం చేస్తోందని వివరించాడు. ఈ పురాతన అభ్యాసం... శారీరక, మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని అన్నాడు. ఆరోగ్య రక్షణ పెరిగేందుకు యోగా శక్తిని ఉపయోగిద్దామని ఈ మాజీ స్టార్‌ ఓపెన్‌ సూచించాడు. వృక్షాసనం వేస్తున్న ఫొటోను ట్వీట్‌ చేసిన ప్రజ్ఞాన్‌ ఓజా.... దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు యోగాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓజా అభిప్రాయపడ్డాడు. ప్రతి ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది యోగా ఫర్‌ వసుధైక కుటుంబం అనే నినాదంతో యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Tags

Next Story