Mohammed Shami: అర్జున అవార్డు స్వీకరించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ

Mohammed Shami:  అర్జున అవార్డు స్వీకరించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ
రాష్ట్రపతి చేతులమీదుగా నేడు ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం

భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌తిష్థాత్మ‌క అర్జున అవార్డు అందుకున్నారు. మంగ‌ళ‌వారం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముచేతుల మీదుగా ఈ అవార్డు స్వీక‌రించారు. భార‌త క్రీడా రంగంలో ఖేల్ ర‌త్నఅవార్డు త‌ర్వాత రెండో అత్యుత్త‌న్న‌త అవార్డు అందుకున్న ష‌మీ త‌న క‌ల నిజ‌మైంద‌ని అన్నాడు. భారత్ తరఫున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకడు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో షమీ బౌలింగ్ ప్రదర్శన అతడి పేస్, స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఎప్పటినుంచో టీమిండియాకు షమీ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కేంద్రం షమీకి అర్జున అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ఇవాళ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు స్వీకరించాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నేడు క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశారు.

మహ్మద్ షమీ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. అయితే, అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి పశ్చిమ బెంగాల్ కు తరలివెళ్లాడు. బెంగాల్ తరఫున రంజీల్లో సత్తా చాటి టీమిండియా తలుపుతట్టాడు. 33 ఏళ్ల షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు... 101 వన్డేల్లో 195 వికెట్లు... 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్ ల్లోనే 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2023కు గానూ 26 మంది అర్జున అవార్డు స్వీక‌రించారు. వీళ్ల‌లో ఆసియా గేమ్స్‌లో ప‌త‌కాలు కొల్ల‌గొట్టిన అథ్లెట్స్ ఎక్కువ మంది ఉండ‌డం గ‌మ‌నార్హం.

అర్జున అవార్డు:

ఆర్చ‌రీ – అదితి గోపిచంద్ స్వామి, ఒజాస్ ప్ర‌వీణ్ డియోట‌లే.

అథ్లెటిక్స్ – ప‌రుల్ చౌద‌రీ, శ్రీ‌శంక‌ర్ ముర‌ళి.

బాక్సింగ్ – మ‌హ్మ‌ద్ హుసాముద్దీన్.

చెస్ – ఆర్ వైశాలి.

క్రికెట్ – మ‌హ్మ‌ద్ ష‌మీ.

ఈక్వెస్ట్రియ‌న్ – అనుష్ అగ‌ర్వాల.

ఈక్వెస్ట్రియ‌న్ డ్రెస్సేజ్ – దివ్య‌క్రితి సింగ్.

గోల్ఫ్ – దిక్షా ద‌గ‌ర్.

హాకీ – కృష్ణ‌న్ బ‌హూద‌ర్ పాఠ‌క్, పుఖ్రంబం సుహిలా చాను.

క‌బ‌డ్డీ – ప‌వ‌న్ కుమార్, రీతు నేగీ.

ఖో ఖో – న‌స్రీన్.

లాన్ బౌల్స్ – పింకీ

షూటింగ్ – ఐశ్వ‌ర్య ప్ర‌తాప్ సింగ్ తోమ‌ర్. ఈషా సింగ్

స్క్వాష్ – హ‌రీంద‌ర్ పాల్ సింగ్ సాధు.

టేబుల్ టెన్నిస్ – ఆహికా పంగ‌ల్.

రెజ్లింగ్ – సునీల్ కుమార్, అంతిమ్ పంగ‌ల్.

వుషూ – నవోరెమ్ రోషిబిన దేవి.

పారా ఆర్చ‌రీ – శీత‌ల్ దేవి.

అంధుల క్రికెట్ – ఇల్లూరి అజ‌య్ కుమార్ రెడ్డి.

పారా క‌నోయింగ్ – ప్ర‌చీ యాద‌వ్

Tags

Next Story