Shane Warne Last Tweet : అతనికి నివాళులు అర్పించిన కొన్ని గంటల్లోనే వార్న్ కూడా తిరిగిరాని లోకాలకు..!

Shane Warne Last Tweet : అతనికి నివాళులు అర్పించిన కొన్ని గంటల్లోనే వార్న్ కూడా తిరిగిరాని లోకాలకు..!
Shane Warne Last Tweet : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం అందరిని షాక్ కి గురిచేసింది...

Shane Warne Last Tweet : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం అందరిని షాక్ కి గురిచేసింది... గుండెపోటుతో ఈ రోజు శుక్రవారం (మార్చి 4)న వార్న్ మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వార్న్ వయసు 52 సంవత్సరాలు.. లెగ్ స్పిన్నర్ గా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన వార్న్ ఇలా హటాత్తుగా మరణించడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. వార్న్ మరణ వార్త తెలియగానే క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వార్న్ తన చివరి ట్వీట్ ని ఈ రోజు ఉదయం 07: 23 గంటలకి పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతిచెందగా అతని నివాళి అర్పించాడు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లుగా రాసుకొచ్చాడు. అయితే ఇది జరిగిన కొన్ని గంటలకే వార్న్ కి కూడా గుండెపోటు రావడం, అతను కూడా తిరిగిరాని లోకాలకి చేరడం యావత్ క్రికెట్ అభిమానులను షాక్ కి గురిచేసింది.

వార్న్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తం 145 టెస్టుల్లో 708 వికెట్లు తీశాడు.. ఇక 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. టెస్టులో 5 వికెట్లు 37 సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశాడు వార్న్. మొదటి ఐపీఎల్ కప్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకి వార్న్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

Tags

Read MoreRead Less
Next Story