Kohli-Rohith: కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్‌పై గంగూలీ కామెంట్స్..

2023 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్ ముగియనుందా..?. దీనిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తాను సమయం కన్నా, ఆటగాళ్ల ప్రతిభ, ప్రదర్శనలను ఎక్కువగా నమ్ముతానన్నాడు. వరల్డ్‌కప్ 2023 షెడ్యూల్ ఐసీసీ నిన్న ప్రకటించింది. ఈ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ కోసం 2023 వరల్డ్‌కప్ గెలవాలి అంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ఇపుడు సౌరభ్ గంగూలీ కూడా స్పందించాడు.
గంగూలీ మాట్లాడుతూ.. మొదటి సారి, చివరిసారి వంటి మాటలను నేను ఎక్కువగా నమ్మను. ఆటగాళ్ల ప్రతిభ, ప్రదర్శనను నమ్ముతాను. ఇంతకుముందు 4 యేళ్లకు ఓసారి వరల్డ్‌కప్ ఉండేది. ప్రస్తుతం T20, 50 ఓవర్ వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలు దాదాపు ప్రతీ సంవత్సరం ఉంటున్నాయన్నాడు. రోహిత్, కోహ్లీకి ఇప్పుడు అటూ ఇటూగా 35 ఏండ్లు ఉంటాయి. ఈ వరల్డ్‌కప్‌లో ఏం జరగనుందో నేను చెప్పలేను. ఆటగాళ్ల ప్రదర్శన బట్టే ఏదైనా ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వరల్డ్‌కప్‌లో తమదైన ముద్ర వేసి జట్టుకు వరల్డ్‌కప్ తేవాలని కోరుకుంటుంటారు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Kohli-Sachin at 2011 WorldCup Winning Ceremony
అక్టోబర్ నెలలో జరగనున్న వరల్డ్‌కప్‌లో భారత్ రోహిత్ శర్మసారథ్యంలో బరిలోకి దిగనుంది. కోహ్లీకి కప్ అందించాలని జట్టు ఉవ్విళ్లూరుతోంది. 2011 లో ధోనీ సారథ్యంలో భారత్ కప్ గెలిచింది. అదే సీన్‌ని ఇప్పుడు రిపీట్ చేయాలనుకుంటున్నారు భారత ఆటగాళ్లు. అప్పుడు వరల్డ్‌కప్ గెలిచి దిగ్గజం సచిన్‌కు ఘన వీడ్కోలు పలికినట్లుగా, ఇపుడు కూడా విరాట్ కోహ్లీకి గుర్తుండిపోయేలా కానుక ఇవ్వాలని భారత మాజీ ఆటగాళ్లు కోరుకుంటున్నారు. కప్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ సచిన్ 2 దశాబ్ధాలు భారత క్రికెట్ జట్టు భారాన్ని మోసాడు. ఇపుడు అతన్ని మోసే బాధ్యత మాదే అంటూ కామెంట్ చేశాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com