DADA DANCE: లండన్ వీధుల్లో గంగూలీ చిందులు..ఫ్యామిలీతో కలిసి మాస్ స్టెప్పులు

DADA DANCE: లండన్ వీధుల్లో గంగూలీ చిందులు..ఫ్యామిలీతో కలిసి మాస్ స్టెప్పులు
DADA DANCE: బర్త్ డే సందర్భంగా లండన్ వీధుల్లో గంగూలీ చిందులు వేశాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు.

టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్, గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ శుక్రవారం తన 50వ బర్త్ డే వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకున్నాడు. సచిన్ టెండూల్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షా వంటి వారితో కలిసి లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో దాదా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. గంగూలీ బర్త్ డే సందర్భంగా అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. HBD DADA ట్విటర్‎లో ట్రెండ్ అయింది.

తన బర్త్ డే సందర్భంగా లండన్ వీధుల్లో గంగూలీ చిందులు వేశాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. అతడి చుట్టూ ఉన్న వారు కూడా ఉత్సాహంగా డ్యాన్స్ లు వేశారు. కుమార్తె సనా ఎదురుగా బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని టైటిల్ సాంగ్‌కు చిందేస్తూ దాదా స్టెప్పులు వేశాడు. అలాగే మరో బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌కు భార్య డోనాతో కలిసి డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. గంగూలీలో ఉన్న డ్యాన్సింగ్‌ టాలెంట్‎ని చూసిన నెటిజన్లు, ఫాన్స్, ఫిదా అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story