Sourav Ganguly: విరాట్ కోహ్లీ మా మాట వినలేదు: గంగూలీ

Sourav Ganguly: ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. విరాట్ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ ఊరుకున్నా.. ఆ తర్వాత విరాట్‌కు కనీసం చెప్పకుండా తనను కెప్టెన్సీ నుండి తప్పించారన్న వార్త వైలర్‌గా మారింది. దాని గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు.
విరాట్ కోహ్లీ తనంతట తానుగా టీ20 క్రికెట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించట్లేదని ప్రకటించాడు. కానీ టెస్ట్ క్రికెట్, వన్డే గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విరాట్.. రానున్న సౌత్ ఆఫ్రికా టెస్ట్‌లో తానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఈసారి రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఉండనుందని బీసీసీఐ.. విరాట్‌కు పెద్ద షాకే ఇచ్చింది.
విరాట్ కెప్టెన్‌గా ఉండకపోవడంపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో గంగూలీ ఈ విషయంపై స్పందించారు. టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకోవద్దని కోహ్లీని బీసీసీఐ చాలాసార్లు కోరిందని గంగూలీ అన్నారు. అయినా కోహ్లీ వినకుండా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని తెలిపారు. వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్‌కు ఇద్దరు కెప్టెన్స్ ఉండడం కరెక్ట్ కాదు అనుకున్న బీసీసీఐ రోహిత్ శర్మను టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా నియమించిందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com