నిలకడగానే సౌరభ్‌ గంగూలీ ఆరోగ్యం.. ఊపిరి పీల్చుకుంటున్న అభిమానులు

నిలకడగానే సౌరభ్‌ గంగూలీ ఆరోగ్యం.. ఊపిరి పీల్చుకుంటున్న అభిమానులు
గంగూలీకి తప్పనిసరిగా మరో యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉందని వైద్యులు ప్రకటించారు.

బీసీసీఐ బాస్‌ సౌరభ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు వైద్యులు. అయితే త్వరలోనే అతనికి మరో యాంజియోప్లాస్టీ చేయక తప్పదంటున్నారు. స్వల్ప గుండెపోటుతో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ మూడు రోజుల కిందట ఆసుపత్రిలో చేరారు. అతడి గుండె రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించిన వైద్యులు అందులో ఒకదాన్ని తొలగించడం కోసం స్టెంట్‌ వేశారు. తొమ్మిది మంది సభ్యుల సీనియర్‌ వైద్యుల బృందం సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మరో యాంజియోప్లాస్టీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

కొన్ని రోజుల్లో లేదా కొన్ని వారాల్లో గంగూలీకి తప్పనిసరిగా మరో యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే అతడి ఆరోగ్యం కోసం ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటికి వెళ్లిన తరువాత కూడా అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటామన్నారు వైద్యులు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ దేవుళ్లను మొక్కుతున్నారు.


Tags

Next Story