Hardik Pandya: తనను జట్టులోకి ఎంపిక చేయొద్దన్న హార్థిక్ పాండ్యా.. స్పందించిన సౌరవ్..

Hardik Pandya: క్రికెట్‌లో గాయాలు సహజం. కానీ ఒక్కొక్కసారి క్రికెటర్‌కు తగిలే గాయం మానడానికి చాలా సమయమే పట్టొచ్చు. అలా అని.. వారు ఫార్మ్ కోల్పోయినట్టు కాదు.. టీమ్‌కు ఇంక ఫిట్ కాదని కాదు.. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు సౌరవ్ గంగూలి. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడడం గంగూలి లక్షణం. అలాంటి ఆయన తాజాగా గాయంతో కొంతకాలం క్రికెట్‌కు దూరమైన ఆటగాడి గురించి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
హర్దీక్ పాండ్యా.. తన గురించి వ్యక్తిగతంగా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. తన ఆటతో సమాధానం చెప్పగల ఆటగాడు. కానీ ఈ క్రికెటర్ గతకొంతకాలంగా ఆటలో ఫార్మ్ కోల్పోయాడు. ఐపీఎల్ నుండి టీ20 వరల్డ్ కప్ వరకు హార్థిక్ పాండ్యా గేమ్‌లో మ్యాజిక్ మిస్ అయ్యింది. అందుకే న్యూజిలాండ్ టెస్ సిరీస్‌కు పాండ్యాను ఎంపిక చేయలేదు బీసీసీఐ.
తన ఆరోగ్య పరిస్థిని దృష్టిలో పెట్టుకుని తాను పూర్తిగా ఫిట్ అయ్యేంత వరకు మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టనని పాండ్యా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇదే విషయంపై సౌరవ్ గంగూలిని ప్రశ్నించగా.. హార్థిక్ పాండ్యా మంచి ఆటగాడే కానీ ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా లేడు అందుకే టీమ్‌లో తీసుకోలేదు అని స్పష్టం చేశారు. పైగా అతడికి చాలా భవిష్యత్తు ఉందని, త్వరలోనే కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు సౌరవ్.
ప్రస్తుతం ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్‌లో పాల్గొనడానికి ఆ దేశానికి వెళ్లా్ల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితులు బాగా లేకపోవడంతో ఈ సిరీస్ క్యాన్సల్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఫస్ట్ టెస్ట్ డిసెంబర్ 17 నుండి ప్రారంభం కానుండగా త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇస్తామని సౌరవ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com