Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి కోవిడ్ పాజిటివ్..

Sourav Ganguly: బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా కోల్‌కతా సిటీ ఆస్పత్రిలో చేరినట్లు క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.
గంగూలీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయించుకున్నారు. అయినా వృత్తి పరమైన కార్యకలాపాలతో విస్తృతంగా ప్రయాణిస్తున్నారు. 49 ఏళ్ల గంగూలీకి RT-PCR పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో సోమవారం రాత్రి ఆస్పత్రికి తరలించారు.
గత రాత్రి అతడిని వుడ్‌ల్యాండ్స్ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని బిసిసిఐ తెలిపింది. గంగూలీ ఈ సంవత్సరం ప్రారంభంలో వివిధ అనారోగ్య కారణాలతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న గంగూలీ అత్యవసర యాంజియోప్లాస్టీ చేయించుకుని కోలుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com