శ్రీలంక చెత్త రికార్డు.. ఆ తర్వాతి స్థానంలో భారత్..!

వన్డే క్రికెట్ చరిత్రలో శ్రీలంక జట్టు చెత్త రికార్డును నెలకోల్పింది. వన్డేలలో ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన జట్టుగా మొదటిస్థానంలో లంక నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓడిన లంక జట్టు 428వ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ఇప్పటివరకు 858 వన్డే మ్యాచ్‌లాడిన శ్రీలంక 390 విజయాలు, 428 పరాజయాలు చవిచూసింది. అయితే ఆ తరవాతి స్థానంలో టీంఇండియా ఉండడం గమనార్హం. అయితే మ్యాచ్‌ల సంఖ్య పరంగా చూస్తే టీంఇండియా ఇప్పటివరకు 993 వన్డే మ్యాచ్‌లాడింది. శ్రీలంకతో పోలిస్తే 137 మ్యాచ్‌లు అధికంగా ఉన్నాయి. ఇక్కడో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టీ20ల్లో అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా శ్రీలంక(70) తొలి స్థానంలో ఉంది. కుమార సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్లు రిటైర్ అయి వెళ్ళిపోవడంతో జట్టు ఆట తీరు పూర్తిగా పడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com