ప్రజాదరణలో ధోని తరువాతే.. సచిన్, కోహ్లీ: సునీల్ గవాస్కర్

ప్రజాదరణలో ధోని తరువాతే.. సచిన్, కోహ్లీ: సునీల్ గవాస్కర్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఓ రేంజ్‌లో ఎత్తేశారు.

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఓ రేంజ్‌లో ఎత్తేశారు. ప్రస్తుతం 13వ ఐపీఎల్ కోసం కామెంట్రీ కోసం యూఏఈలో ఉన్న ఆయన ధోని అరుదైన కెప్టెన్ అని అన్నారు. కెప్టెన్ గానే కాకుండా ఒక ఆటగాడిగా కూడా ధోనికి ఓ ప్రత్యేకశైలి ఉంటుందని తెలిపారు. రెండు సార్లు భారత్‌కు ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన మహేంద్రసింగ్ ధోని.. సచిన్, విరాట్ కోహ్లీ కంటె ఎక్కువ ప్రజాధరరణ ఉన్న క్రికెటర్ అని అన్నారు. కాగా ధోనీ ఇటీవలే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Tags

Next Story