Sunrisers Hyderabad: న్యూజిలాండ్‌కు కేన్.. ఇప్పుడు ఆ ఇద్దరిలో సన్‌రైజర్స్‌కు సారథి ఎవరు..?

Sunrisers Hyderabad: న్యూజిలాండ్‌కు కేన్.. ఇప్పుడు ఆ ఇద్దరిలో సన్‌రైజర్స్‌కు సారథి ఎవరు..?
Sunrisers Hyderabad: ముంబై ఇండియన్స్‌‌తో ఆట ముగిసిన తర్వాత కేన్ విలియమ్సన్‌ న్యూజిలాండ్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు.

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో మొదటి నుండి ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కెప్టెన్సీ్ చేతులు మారడం.. సీనియర్ టీమ్‌లు కూడా ప్లే ఆఫ్స్ వరకు వెళ్లలేకపోవడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇక తాజాగా సన్‌రైజర్స్ కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరగనుంది. ముంబై ఇండియన్స్‌‌తో ఆట ముగిసిన తర్వాత కేన్ విలియమ్సన్‌ న్యూజిలాండ్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. దీంతో తన స్థానంలో వేరే కెప్టెన్.. ఈ సీజన్‌ను నడిపించనున్నాడు.

మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది సన్‌రైజర్స్. ఈ మ్యాచ్‌లో మంచి ఆట కనబరచడంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కాపాడుకుంది ఎస్‌ఆర్‌హెచ్. ఇక దీని తర్వాత మే 22న పంజాబ్ కింగ్స్‌‌తో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ టీమ్‌కు చాలా కీలకం. కానీ ఇంతలోనే ఐపీఎల్ 2022కు కిమ్‌కు దూరంగా కానున్నాడు. కేన్ భార్య సారా రహీం ప్రెగ్నెంట్‌గా త్వరలోనే డెలివరీకి సిద్ధంగా ఉండడంతో కేన్ వెంటనే న్యూజిలాండ్‌ వెళ్లాల్సి వచ్చింది.

అయితే ఎస్‌ఆర్‌హెచ్.. ఐపీఎల్ 2022లో ఇకపై ఆడనున్న మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ లేదా విండీస్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరిలో భువనేశ్వర్ పేరే దాదాపు ఖరారుగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కేన్ న్యూజిలాండ్‌ వెళ్లిన విషయాన్ని సన్‌రైజర్స్ తమ ఆఫీషియల్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.




Tags

Next Story