SRH vs CSK : సన్‌రైజర్స్ బోణీ... మళ్ళీ ఓడిన చెన్నై..!

SRH vs CSK : ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ.. చెన్నై పై ఎనమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. 155 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మలు 89 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.. రాహుల్ త్రిపాఠీ (39*), నికోలస్ పూరన్ (5*) జట్టుని విజయతీరాలకు చేర్చారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై జట్టును హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. దీనితో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (48) ఒక్కడే పర్వాలేదని అనిపించాడు. ఇక ఐపీఎల్ హిస్టరీలో నాలుగుసార్లు కప్ కొట్టిన చెన్నై జట్టు వరుసగా గత నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com