T20 World Cup: వేటకు సిద్ధమైన సివంగులు

T20 World Cup: వేటకు సిద్ధమైన సివంగులు
ఆదివారం గ్రూప్‌-బిలో భాగంగా పాకిస్థాన్‌తో మొదటి మ్యాచ్‌

భారత మహిళల జట్టు టీ-20 ప్రపంచకప్ వేటకు సిద్ధమైంది. ఆదివారం గ్రూప్‌-బిలో భాగంగా పాకిస్థాన్‌తో మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఈ పోరులో భారత్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఐతే ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్‌ స్మృతి మందన ఆమె వేలికి గాయం కావడంతో దూరంగా ఉండనున్నది. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమిమా కీ రోల్ ప్లే చేయనున్నారు. కెప్టెన్‌గా అండర్‌-19 వరల్డ్‌కప్ సాధించిన షెఫాలి వర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనుంది. ఐతే బౌలింగ్ విభాగం మాత్రం భారత్‌ను కలవరపెడుతోంది. పేసర్ రేణుక సింగ్ మాత్రమే పర్వా లేదని పిస్తోంది. ఇక ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఆరు సార్లు పాకిస్థాన్‌తో తలపడిన భారత మహిళల జట్టు నాలుగు సార్లు విజయం సాధించింది. మొత్తం టీ 20ల్లో 13 సార్లు తలపడగా భారత్‌ 10, పాకిస్థాన్ 3 మ్యాచుల్లో నెగ్గాయి.

Tags

Next Story