T20 World Cup Final : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ప్రత్యర్థికి బ్యాటింగ్..!
T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి రంగం సిద్దమైంది.. ముందుగా టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇందులో ఏ జట్టు గెలిచినా కొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుంది.
ఆస్ట్రేలియా జట్టు
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టాయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్‌కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
న్యూజిలాండ్ జట్టు
మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, సీఫర్ట్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నె, టిమ్ సౌథీ,ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్
కివీస్ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com