Afghanistan cricket : మీ వెంట మేమున్నాం.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా..!

By - /TV5 Digital Team |23 Aug 2021 2:00 AM GMT
గతవారంలో ఆఫ్గాన్ తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్ళిపోవడంతో ఆ దేశ క్రికెట్ నియంత్ర్రణ పైన అనుమానాలు నెలకొన్నాయి.
గతవారంలో ఆఫ్గాన్ తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్ళిపోవడంతో ఆ దేశ క్రికెట్ నియంత్ర్రణ పైన అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఎవ్వరు కూడా ఉహించని విధంగా తాలిబన్లు ఆఫ్గాన్ క్రికెట్ కి మద్దతు పలికారు. తాజాగా తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అఫ్గాన్‌కు లైన్ క్లియర్ అయినట్లేనని సమాచారం. కాగా, 1996-2001 మధ్యలో హక్కాని అధ్యక్షతనే అఫ్గాన్‌లో క్రికెట్ ప్రారంభమైంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com