అరుదైన రికార్డు సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి

ప్రపంచ క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్‌గా విమర్శకుల ప్రశంసలు పొందుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయి చేరుకున్న క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఘనత సాధించాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరటి ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు...
విరాట్ కోహ్లీ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని అతని రికార్డులను చూస్తేనే అర్థం అవుతుంది. తన కెరీర్‌లో 251 మ్యాచులాడిన కొహ్లి 242వ ఇన్నింగ్స్‌లో 12 వేల మైలురాయిని అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ 12 వేల పరుగులను చేయడానికి 309 మ్యాచులాడి 300 ఇన్సింగ్స్ తీసుకున్నాడు.
క్రికెట్‌లో పరుగుల రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్న విరాట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీనికి కోహ్లీ కేవలం 462 ఇన్సింగ్స్ మాత్రమే తీసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలైన సచిన్ 493, బ్రియన్ లారా 511, రికీ పాంటింగ్ 514 ఇన్సింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు. కోహ్లి కంటే ముందు.. వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వారిలో టీంఇండియా నుంచి ఇద్దరు ఉండగా, ఆస్ర్టేలియా నుంచి రికీ పాంటింగ్, శ్రీలంక నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com