ODI: ఫస్ట్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ ఎవరంటే..?

ODI: ఫస్ట్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ ఎవరంటే..?
ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా స్పెయిన్ వేదికగా విండీస్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది.

ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆప్‌ స్పెయిన్ వేదికగా విండీస్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో టీమిండియా మూడు పరుగుల తడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి తృటిలో సెంచరీ కోల్పోయిన భారత కెప్టెన్‌ శిఖర్ ధావన్ ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శుభమన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు ఫస్ట్ వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఐతే అర్ధ సెంచరీ చేసుకున్న జోరు మీదున్న గిల్‌ను పూరన్‌ రన్‌ అవుట్ చేశాడు. దీంతో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ సైతం జోరు కొనసాగించాడుయ.

ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశాడు. సెంచరీకి చేరువైన ధావన్‌ మోతి బౌలింగ్‌లో సమర్థ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.కాసేపటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ సైతం అవుట్‌ అయ్యాడు. ఐతే తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ వెంట వెంటనే అవుటయ్యారు. ఓ దశలో నాలుగు వందల పరుగులు చేస్తుందనుకున్న టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.

తర్వాత 309 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌కు నాలుగో ఓవర్‌లోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 16 రన్స్ దగ్గర ఓపెనర్‌ షై హోప్‌ను సిరాజ్‌ పెవిలియన్ చేర్చాడు. ఐతే తర్వాత క్రీజులోకి వచ్చిన సమర్థ్‌ ఓపెనర్‌ మేయర్స్‌తో కలిసి జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. ఈ తరుణంలో హాఫ్‌ సెంచరీకి చేరువైన సమర్థ్‌ను శార్దూల్‌ ఠాకూర్‌ అవుట్ చేశాడు.

తర్వాత వచ్చిన బ్రాండన్‌ కింగ్‌ జోరు కొనసాగించి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో విండీస్‌ టార్గెట్‌కు చేరువైంది. చివరి ఓవర్‌లో ఆ జట్టుకు 15 పరుగులు అవసరమవగా.. సిరాజ్‌ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌ థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌, చాహల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story