IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా గ్రాండ్‌ విక్టరీ..

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా గ్రాండ్‌ విక్టరీ..
IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. హరారేలో జరిగిన ఈ వన్డేలో 5 వికెట్ల తేడాతో నెగ్గి మరో వన్డే ఉండగానే సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా హరారేలో జరిగిన రెండో వన్డేలో మరోసారి టాస్‌ భారత్‌ను వరించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వేను మరోసారి భారత్‌ బౌలర్లు స్వల్ప స్కోరుకే కుప్పకూల్చారు. శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లతో పాటు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం ధావన్‌తో కలిసి భారత్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్‌ రాహుల్‌ తొందరగానే అవుటై డిసప్పాంట్‌ చేశాడు. అయితే లక్ష్యం తక్కువగానే ఉండటంతో ఏమాత్రం కంగారు లేకుండా టీమిండియా మ్యాచ్‌ను కూల్‌గా ముగించింది. ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ చెరో 33 రన్స్‌, దీపక్‌ హూడా 25 రన్స్‌తో రాణించారు. చివర్లో సంజూ శాంసన్‌ 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ తో టీమిండియా 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. దూకుడుగా ఆడి 39 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Tags

Next Story