AB de Villiers: మూడు భాషల్లో వీడ్కోలు.. క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన AB డివిలియర్స్ ..

AB de Villiers: మూడు భాషల్లో వీడ్కోలు.. క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన AB డివిలియర్స్ ..
AB de Villiers: AB డివిలియర్స్, IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి తన క్రికెట్ జీవితాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు.

AB de Villiers: AB డివిలియర్స్, IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి తన క్రికెట్ జీవితాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లీష్, ఆఫ్రికన్, హిందీ మూడు భాషల్లో వీడ్కోలు సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆట నుండి తప్పుకుంటున్నానని తెలిపాడు.

AB డివిలియర్స్ - భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన విదేశీ క్రికెటర్. శుక్రవారం అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో అతని అనుబంధాన్ని కూడా ముగించాడు. 'ధన్యవాదాలు, డాంకీ, ధన్యవాద్' అంటూ మూడు భాషల్లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన డివిలియర్స్, 37 ఏళ్ల వయసులో తనలో 'ఆడే శక్తి సన్నగిల్లింది' అని చెప్పాడు.

" ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ నేను అన్ని క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. తోటి క్రికెట్ సోదరులతో కలిసి బ్యాక్ యార్డ్ మ్యాచ్‌లు ఆడినప్పటి నుండి, నేను ఉత్సాహంతో ఆడాను. ఇప్పుడు, 37 సంవత్సరాల వయస్సులో ఆటలో అంత ఉత్సాహం చూపించలేను అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

"ఇన్నాళ్లుగా నాపై నమ్మకం ఉంచి, మద్దతుగా నిలిచిన RCB మేనేజ్‌మెంట్, నా స్నేహితుడు విరాట్ కోహ్లి, సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానులు మరియు మొత్తం RCB కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. RCBతో నా అనుబంధం అపూర్వం. మరిచి పోలేని ఓ మంచి జ్ఞాపకం. వ్యక్తిగతంగా మన సంతోషం కోసం కొన్ని అపురూప జ్ఞాపకాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి అని డివిలియర్ తెలిపాడు.

RCB ఎల్లప్పుడూ నాకు, నా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంది. నేను ఎప్పటికీ RCBకి చెందిన వాడినే అని డివిలియర్స్ పేర్కొన్నాడు. RCB ద్వారా ఐపీఎల్‌లో డివిలియర్స్ లీగ్‌లో 5000కు పైగా పరుగులు చేశాడు. అతను 2015లో ముంబై ఇండియన్స్‌పై 133 నాటౌట్ మరియు 2016లో గుజరాత్ లయన్స్‌పై 129 నాటౌట్‌తో IPLలో రెండవ, మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ల రికార్డును కలిగి ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story