మన క్రికెటర్లకి సేమ్ టు సేమ్.. అందరూ మహాలక్ష్మిలే!

మన క్రికెటర్లకి కొన్నేళ్లుగా దేవుడు సేమ్ గిఫ్ట్ అందిస్తున్నాడు! రోహిత్‌శర్మకి అదే గిఫ్ట్.. పుజారాకీ అదే గిఫ్ట్. తాజాగా విరాట్ కోహ్లీకీ కూడా సేమ్ టు సేమ్ గిప్ట్ అందించాడు ఆ భగవంతుడు. అడక్కుండానే ఆ దేవుడు మన క్రికెటర్ల ఇంటికి మహాలక్ష్మిని పంపిస్తున్నాడు. మరి అదృష్టవంతులైన ఆ ముద్దుల తనయల గురించి తెలుసుకుందామా..
'మా ఇంటికి మహాలక్ష్మి వచ్చేసిందోచ్' అంటూ తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తొలి బిడ్డ పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తూ.. కోహ్లీ తన ఇన్‌స్టాలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
ఇటీవలే హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ.. రితికా సజ్దాల జంటకు కూతురు పుట్టింది. ఆ క్యూట్ బేబీ పేరు సమైరా. రోహిత్ ఇన్‌స్టాలో ఎక్కువ ఫొటోలు సమైరావే.
ఇక ఛేతేశ్వర్ పుజారాకి మొదటి సంతానం అమ్మాయి. తన ముద్దుల తనయ పేరు అదితి. పుజారా తన భార్య పూజాతో కలిసి ఆ చిన్నారి చేసే అల్లరి ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఇక వైస్ కెప్టెన్ అజింక్యా రహానే..రాధిక జంటకు క్యూట్ కూతురు. తన పేరు ఆర్యా రహానే. ఆర్యాకి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటాడు రహానే.
ఇక రవిచంద్రన్ అశ్విన్.. ప్రీతీ నారాయణన్ జంటకు చూడచక్కని కూతుళ్లు ఆద్యా, అకీరాలు. ముద్దుముద్దు మాటలతో ట్విట్టర్‌లో భలే సందడి చేస్తుంటారు.
'సర్' రవీంద్ర జడేజా తొలి ముద్దుల తనయ పేరు నిద్యానా. ఇక ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా జనవరి 1న తన చిన్నారికి స్వాగతం పలికాడు.
సురేశ్ రైనా- ప్రియాంకా చౌధురీ జంటల ముద్దుల తనయ పేరు గ్రేసీ రైనా. రైనా తన క్యూట్ బేబీ పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుని తన తండ్రీ ప్రేమను చాటుకున్నారు.
హర్భజన్‌సింగ్- గీతా బస్రాల కూతురు హినాయా సింగ్. ఇక మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోనీ-సాక్షిల క్యూట్ కూతురు పేరు జివా. ఐదేళ్ల ఈ క్యూట్ గాళ్ చాలా పాపులర్ అయింది.
కూతురు పుట్టిందనే వార్త వినగానే ఆనందంతో ఎగిరిగంతేసినా వారే ఈ క్రికెటర్లలంతా. మన ఆటగాళ్లందరికీ ఈ మధ్య కాలంలో వరుసగా కూతుళ్లు పుట్టడం, పుడుతుండటం ఆసక్తికరమైన విశేషం!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com