IPL 2022: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు వీళ్ళే..!

IPL 2022: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు వీళ్ళే..!
IPL 2022: అంబటి రాయుడు, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కోన శ్రీకర్ భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు

IPL2022: క్రికెట్ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 డేట్ రానే వచ్చింది. శనివారం నాడు వాంఖడే వేదికగా కోల్ కతా, చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్ తో ఈ క్యాష్ రిచ్ లీగ్ కు తెరలేవనుంది. ఈ మెగా టోర్నమెంట్ లో తెలుగు ఆటగాళ్లు తమ సత్తా చాటనున్నారు.


ఈసారి ఐపీఎల్ లో ఆయా జట్లకు ఆడుతున్న హైదరాబాద్, ఆంధ్ర జట్ల ఆటగాళ్లు.. అంబటి రాయుడు, భగత్ వర్మ, కోన శ్రీకర్ భరత్, హైదరాబద్ జట్టు నుంచి సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ బుద్ది, ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్ లో భాగమయ్యారు.


అంబటి రాయుడు, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కోన శ్రీకర్ భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు. ఇక సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతుండగా.. రాహుల్ బుద్ధి, ఠాకూర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ నుంచి ఆడుతున్నారు.


ఈ సీజన్‌ను టాటా IPL 2022 అని పిలుస్తారు, ఎందుకంటే టైటిల్‌ను టాటా స్పాన్సర్ చేస్తుంది. IPL సీజన్ 15 యొక్క అన్ని మ్యాచ్‌లకు ముంబై, పూణే వేదిక కానున్నాయి. సాధారణంగా, IPL మ్యాచ్‌లు భారతదేశంలోని 6 వేదికలలో ఆడేవి. అవి చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో జరిగేవి.


COVID పరిస్థితుల కారణంగా వేదికలు మారుతున్నాయి. IPL మ్యాచ్‌లు 26 మార్చి 2022 నుండి ప్రారంభమై మే 2022 వరకు ముగియవచ్చు. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీతోపాటు నగదు బహుమతి కూడా అందజేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story