Vinod Kambli: కష్టాల్లో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి.. సాయం కోసం ఎదురుచూపు..
Vinod Kambli: లెజెండరీ క్రికెటర్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు చిన్ననాటి ఫ్రెండ్.. ఇదంతా గతం. ఇప్పుడు ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. అప్పట్లో తన స్టైలిష్ గేమ్‌తో అందర్నీ కట్టిపడేసిన వినోద్ కాంబ్లి.. అగ్రెసివ్‌నెస్, ఆరోగెన్స్, ఫిక్సింగ్ ఆరోపణలతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఒకానొక స్థాయిలో సచిన్ తెందుల్కర్‌ను కూడా మించిపోవచ్చనే ఆశలు రేపిన కాంబ్లీ.. ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు.
కరోనా తర్వాత తన జీవిత దుర్బరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కాంబ్లీ. బీసీసీఐ ఇస్తున్న 30వేల పెన్షన్‌తోనే నెట్టుకొస్తున్నానని వాపోయాడు. కుటుంబాన్ని పోషించడానికి తాను పడుతున్న కష్టాలు సచిన్ తెందుల్కర్‌కు కూడా తెలుసన్నాడు. ఐతే సచిన్ నుంచి తాను ఏమీ ఆశించట్లేదని చెప్పాడు. తెందుల్కర్ తన అకాడమీలో కోచ్‌గా ఉద్యోగం ఇచ్చినప్పటికీ.. దూరం ఎక్కువగా ఉండటంతో వెళ్లలేకపోతున్నట్లు వివరించాడు.
దిక్కుతోచని స్థితిలో ఉన్న వినోద్ కాంబ్లీ.. తనకు ఏదైనా పని చూపించమని వేడుకుంటున్నాడు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. క్రికెట్ పురోగతి కమిటీలో స్థానం కల్పించినా అది గౌరవపూర్వక హోదా మాత్రమేనని.. కుటుంబాన్ని పోషించాలంటే ఆదాయం కావాలి కాదా అంటున్నాడు. ఏదైనా పని ఉంటే చెప్పమని ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదని వాపోయాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com