రోహిత్‌ను తొలగించి.. వారికి అవకాశం ఇవ్వండి : బీసీసీఐని కోరిన కోహ్లీ.. ?

టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతూ టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కి కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లుగా కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే.. తదుపరి టీ20 కెప్టెన్ ఎవరన్న దానిపై ఆసక్తికరంగా పెరిగింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకి కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలావుండగా కోహ్లీకి, రోహిత్ శర్మకి మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో వార్త తెరపైకి వచ్చింది. అదేటంటే.. వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, టీ20లలో వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని కోహ్లి మేనేజ్‌మెంట్‌నను కోరాడని సమాచారం. రోహిత్ శర్మ వయస్సు(34) దృష్ట్యా అతడిని వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని కోహ్లీ మేనేజ్‌మెంట్‌నను కోరినట్లుగా సమాచారం. ఈ వార్తలతో కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయన్న వార్తలకి మరింత బలం చేకూరుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com