Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కెప్టెన్సీ నుండి తప్పుకున్నా..
Virat Kohli (tv5news.in)
Virat Kohli: టీమిండియాకు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నా విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2022 జనవరి నెలకు సంబంధించి భారత్‌లో పాపులర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఓర్మాక్స్ మీడియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కోహ్లీ తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డే విభాగంలో రెండు.. టెస్టు ర్యాంకుల్లో ఏడో స్థానం.. టీ20 ర్యాంకుల్లో పదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో విలువైన ఆటగాడిగా పేరుపొందిన కోహ్లి అంతేస్థాయిలో ప్రజాభిమానాన్ని పొందుతున్నట్లు ఓర్మాక్స్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సచిన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు పదేళ్లు అవుతున్నా సచిన్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com