Virat Kohli: ఆర్‌సీబీ ప్లేయర్ పెళ్లి పార్టీ.. 'ఊ అంటావా' పాటకు విరాట్ స్టెప్పులు..

Virat Kohli: ఐపీఎల్‌లో ఓ వైపు టెన్షన్ వాతావరణం ఉండగానే.. మరోవైపు ఆటగాళ్లు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) టీమ్.. తమ ప్లేయర్ డెవాన్ కాన్వే పెళ్లి వేడుకలో సందడి చేశారు. అక్కడ వారు చేసిన డ్యా్న్సుల వీడియోలన్నీ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ)లో పెళ్లి వాతావరణం మొదలయ్యింది.
ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఆర్‌సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఈ సంవత్సరం ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. దానికి కారణం అతడి పెళ్లి. ఆస్ట్రేలియన్ అయిన మ్యాక్స్‌వెల్.. ఇండియన్ అమ్మాయి విను రామన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 మొదలయినప్పుడే మ్యాక్స్‌వెల్ పెళ్లి జరిగింది. కానీ ఆ సమయంలో ప్లేయర్స్ ఫోకస్ అంతా ఆటపై ఉండడంతో తన పెళ్లికి ఎవరూ హాజరు కాలేకపోయారు. అందుకే ఆర్‌సీబీ టీమ్ కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు మ్యాక్స్‌వెల్.
మ్యాక్స్‌వెల్ ఇచ్చిన పెళ్లి పార్టీకి విరాట్.. తన భార్య అనుష్క శర్మతో కలిసి హాజరయ్యాడు. తనతో పాటు ఇతర ఆర్‌సీబీ ఆటగాళ్లు కూడా ఈ పార్టీలో సందడి చేశారు. అయితే వీరంతా కలిసి ఇటీవల ఎంతో పాపులర్ అయిన 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటకు స్టెప్పులేశారు. విరాట్ కూడా వీరితో కలిసి సందడిగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Mood 😎 @imVkohli @RCBTweets #IPL #IPL2022 #ViratKohli #CricketTwitter #RCB #PlayBold pic.twitter.com/pWwYYSFFq0
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) April 27, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com