Virat Kohli: ఫ్రెండ్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ డ్యాన్స్.. క్రేజీ అంటున్న ఫ్యాన్స్..
Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఎప్పుడూ సీరియస్‌గా ఆట మీద దృష్టిపెట్టే క్రికెటర్లు.. ఐపీఎల్ సీజన్ రాగానే కాస్త చిల్ అవుతూ ప్రతీ మ్యాచ్‌లో గెలవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే వారి ఫ్యాన్స్‌కు కూడా కాస్త ఎంటర్‌టైన్మెంట్ అందించే పనిలో పడతారు. తాజాగా విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, డూప్లేస్సీస్ కలిసి ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్‌గా మారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, డూప్లేస్సీస్ గ్రౌండ్‌లోనే ఎక్కువగా కనిపిస్తారు. వీరు సోషల్ మీడియాలో రీల్స్‌లాంటివి చేస్తూ ఎంటర్‌టైన్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఈ ముగ్గురు ఇప్పుడు ఓ ట్రెండింగ్ మ్యూజిక్‌కు స్టెప్పులేశారు. ఇది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఈ ముగ్గురు ఓ బ్రాండ్ యాడ్ కోసం కలిసి స్టెప్పులేశారు. ఇది ఆ బ్రాండ్ తన సోషల్ మీడియా అఫీషియల్ పేజ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు దాదాపు 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్‌సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి ముందంజలో ఉంది. ఈసారైనా ఈ టీమ్ కప్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com