Virat Kohli Captaincy: రిస్క్‌లో విరాట్ కెప్టెన్సీ.. తన ప్లేస్‌లో ఆ ఆటగాడు కెప్టెన్‌గా..

Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ.. అగ్రెసివ్‌గా కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. మొదట్లో ప్రేక్షకుల్లో కెప్టెన్‌గా తనపై ఏ అంచనాలు లేకపోయినా.. తన మెరుపు లాంటి ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచి.. వాట్ ఏ ప్లేయర్ అనిపించుకున్నాడు. బ్యాటింగ్ విషయంలో తనకంటూ రికార్డులను క్రియేట్ చేశాడు. ఒక అగ్రెసివ్ కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి నడిపించి ఎన్నో విజయాలను అందుకునేలా చేశాడు. కానీ గత కొంతకాలంగా విరాట్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
టీమిండియా ఒక ఇంటర్నేషనల్ ట్రోఫీ గెలిచి చాలా కాలమయ్యింది. దీంతో టీమ్‌కు పట్టు తగ్గిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన విరాట్ కూడా తన పర్ఫార్మెన్స్‌తో చాలా వెనకబడ్డాడు. ఆ మధ్య టీమ్ మళ్లీ పుంజుకున్నట్టుగా కనిపించినా.. మళ్లీ వెంటనే ఫార్మ్ కోల్పోయింది. దీంతో బీసీసీఐ కెప్టెన్సీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం విరాట్ కోహ్లీనే అన్ని క్రికెట్ ఫార్మ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ తన కెప్టెన్సీలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇప్పటివరకు ఒక కప్ కూడా గెలవలేదు. దీంతో నిరాశ చెందిన విరాట్.. తనంతట తానుగా ఆర్‌సీబీ కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత విరాట్ టీ20 కెప్టెన్సీకి కూడా ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ కనబరిచిన ఆట ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోవడమే కాకుండా సెమీస్‌కు వెళ్లే అవకాశాలు కూడా లేకుండా చేసుకుంది టీమిండియా. దీంతో టీ20ల్లో విరాట్‌ను కాకుండా మరెవరినైనా కెప్టెన్‌ను చేసే ఆలోచనలో ఉందట బీసీసీఐ.
టెస్ట్ మ్యాచ్‌ల కెప్టెన్సీ విషయంలో ఏ మార్పు ఉండదు. వాటికి విరాటే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయితే టీ20, వన్డేలకు మాత్రం విరాట్ ప్లేస్‌లో మరొకరిని కెప్టెన్‌గా నిర్ణయించాలని తాజాగా జరిగిన బీసీసీఐ మీటింగ్‌లో అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే విరాట్ ప్లేస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటేనే బాగుంటుందని చాలామంది వారి అభిప్రాయాన్ని కూడా వెల్లడించారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com