T20 World Cup: రిస్క్ తీసుకోక తప్పదు: విరాట్ కోహ్లీ

T20 World Cup (tv5news.in)

T20 World Cup (tv5news.in)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పూర్తిగా ఓడిపోయినట్టే అని చాలామంది క్రికెట్ లవర్స్ని రాశకు గురవుతున్నారు.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పూర్తిగా ఓడిపోయినట్టే అనుకుంటూ చాలామంది క్రికెట్ లవర్స్ అప్పుడే నిరాశకు గురవుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇంకా ఆట అయిపోలేదు అని కాస్త నమ్మకంతో ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే తోవలో ఆలోచిస్తున్నాడు. ఇంకా మ్యాచ్ అయిపోలేదు.. ఓటమిని ఒప్పుకునేది లేదు అన్నట్టుగా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు విరాట్ కోహ్లీ.

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పర్ఫార్మెన్స్ అందరినీ నిరాశకు గురిచేసింది. టీమిండియా పెట్టిన టార్గెట్‌ను చాలా ఈజీగా 14 ఓవర్లలోనే చేధించింది న్యూజిలాండ్. దీంతో డూ ఆర్ డై పరిస్థితిలో ఉంది టీమిండియా. సెమీస్‌కు చేరుకోవాంటే ఇండియా రానున్న మూడు మ్యాచ్‌లను గెలవడమే కాకుండా అత్యధిక రన్ రేట్‌ను కూడా మెయింటేయిన్ చేయాలి. ఇదంతా చూసి భయపడుతున్న క్రికెట్ లవర్స్‌కు విరాట్ కోహ్లీ తన మాటలతో ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు.. ' ఇండియా కోసం ఆడుతున్నప్పుడు.. అందరు చాలా అంచనాలతో ఉంటారు. ఆ అంచనాలను అందుకునే ప్రయత్నం అందరూ చేయాలి. ఈ రెండు మ్యాచ్‌లో మేము అది చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం. ఇలాంటి సమయంలోనే పాజిటివ్‌గా ఆలోచిస్తూ రిస్క్‌లు తీసుకుంటూ ఉండాలి. ఒత్తిడిని తట్టుకుని పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకెళ్లాలి. ఆట ఇంకా అయిపోలేదు' అన్నారు.

ఆదివారం న్యూజిలాండ్ గెలుపుతో ప్రస్తుతం ఆ టీమ్ పాయింట్స్ టేబుల్‌లో మూడవ స్థానంలో ఉంది. టీమిండియా చివరి నుండి రెండో స్థానంలో నిలబడింది. విరాట్ చెప్పినట్టుగా ఒత్తిడిని తట్టుకుని టీమిండియా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story