క్రికెట్

Virat Kohli: దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం: విరాట్ కోహ్లీ

Virat Kohli: విరాట్ కోహ్లీ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనిని స్టార్ స్పోర్ట్స్ తన అఫీషియల్ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది

Virat Kohli: దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం: విరాట్ కోహ్లీ
X

Virat Kohli: ప్రతీ ఆటగాడికి అన్నిరోజులు ఒకేలా ఉండవు. వారు చేసే ఒక్క పొరపాటు.. గతంలో వారు గెలిచిన రికార్డులను మర్చిపోయేలా చేయగలదు. స్పోర్ట్స్ లవర్స్‌లో నెగిటివ్ ఫీలింగ్ తెప్పించగలదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో కోహ్లీ తన ఫ్యాన్స్‌ను తృప్తి పరచలేకపోయాడు. దీంతో కోహ్లీ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో టీమ్‌ను గెలిపించడంపైనే ఓ కెప్టెన్ దృష్టి ఉండాలి. ఇప్పటికీ ఎన్నోసార్లు విరాట్.. ఓ మంచి కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహిస్తానని మాటిస్తున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో విరాట్ పర్ఫార్మెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని విండీస్ పర్యటనలో తనకు చోటు ఇవ్వలేదు బీసీసీఐ. దీంతో తర్వాత జరగనున్న ఏషియా కప్, ప్రపంచకప్‌పైనే కోహ్లీ పూర్తిగా దృష్టిపెట్టనున్నాడు.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనిని స్టార్ స్పోర్ట్స్ తన అఫీషియల్ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'నా ముఖ్య లక్ష్యం ఇండియా ఏషియా కప్, వరల్డ్ కప్ గెలవడమే. దానికోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధం' అన్నాడట విరాట్. దీంతో పాటు ఆగస్ట్ 27న ఏషియా కప్ ప్రారంభం కానుందని స్టార్ స్పోర్ట్స్ అప్డేట్ కూడా ఇచ్చేసింది.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES