వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli (tv5news.in)
Virat Kohli : వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టెస్ట్ జట్టును ప్రకటించడానికి గంటన్నర ముందు సెలెక్టర్లు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సమాచారాన్ని ఇచ్చారని వెల్లడించారు. వన్డేలకు, టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని బీసీసీఐకి ఎపుడో తెలియజేశానని, 2023 వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేసినట్లు చెప్పారు. అయినా వాళ్లు నిర్ణయం తీసుకొని వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడం ఆశ్చర్య కలిగిందన్నారు.
దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను కోహ్లీ ఖండించారు. క్రికెట్ నుంచి విరామం కావాలని తాను బీసీసీఐని సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తనకు, రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశారు. విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ మార్పుకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని వెల్లడించింది. కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది.
పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. జట్టులో సమన్వయం లోపిస్తుందని సెలెక్షన్ కమిటీ భావించిందని, అందుకే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com