Virat Kohli: టీమ్ ఇండియా కెప్టెన్.. అనుష్క కంటే ముందు ఆమెతో..

Virat Kohli: టీమ్ ఇండియా కెప్టెన్ గురించి విరాట్ కోహ్లీ గురించి తెలియని వారెవరుంటారు. అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలోనే కాదు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను వివాహం చేసుకుని ఫర్‌ఫెక్ట్ జోడీగా నిలిచారు ఇద్దరూ.
అయితే అనుష్కను వివాహం చేసుకోవడానికి ముందే ఇంగ్లండ్ క్రికెటర్ సారా టైలర్‌ను ఇష్టపడ్డాడట కోహ్లీ. ఈ మహిళా క్రికెటర్ అందానికి అందరితో పాటే కోహ్లీ కూడా ఫిదా అయ్యాడట. ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో భారత జట్టు కెప్టెన్ కోహ్లీ సారాకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుని ఉదయం 5గంటలకే లేచి ఆమె రూమ్‌కి వెళ్లాడట.
చాలా సార్లు కోహ్లీ, సారా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి పెళ్లి మ్యాటర్ మాత్రం ముందుకు వెళ్లలేదు. ప్రేమ వ్యవహారం అంతటితో ముగిసి ఎవరి దారి వారు చూసుకున్నారు. 2019లో ఇంగ్లండ్ ఉమెన్ క్రికెటర్ కేట్ క్రాస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సారాను కలవడానికి విరాట్ ఎంతగానో తాపత్రయపడుతున్నాడంటూ ఆమె ట్వీట్ చేసింది.
2019లోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సారా జట్టు తరపున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ 20లు ఆడింది. టీ 20 ల్లో 2,177 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది.
అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టంపింగ్స్, 128 క్యాచులు అందుకున్న అరుదైన మహిళ సారా టేలర్. 2017లో జరిగిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ గెలవడంలో సారా కీలక పాత్ర పోషించారు.
మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సారా 30 ఏళ్లకే ఆటకు దూరమై ప్రస్తుతం ఓ స్కూల్లో లైఫ్ కోచ్‌గా పని చేస్తోంది. మహిళల శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు.. ఉమెన్స్ హెల్త్ యూకే విజ్ఞప్తి మేరకు న్యూడ్ ఫోటోషూట్‌కు అంగీకరించింది. సారా చేసిన పని ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com