Virat Kohli: విరాట్‌కు బీసీసీఐ షాక్.. తాను ఒప్పుకోకుండానే..

Virat Kohli (tv5news.in)

Virat Kohli (tv5news.in)

Virat Kohli: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ విషయంలో బీసీసీఐలో చాలానే చర్చ నడుస్తోంది.

Virat Kohli: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ విషయంలో బీసీసీఐలో చాలానే చర్చ నడుస్తోంది. త్వరలో జరగనున్న సౌత్ ఆఫ్రికా టూర్‌కు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా అన్న సందేహం ఇంకా తీరనే లేదు. ఇంతలోనే టీమ్‌లో మనస్పర్థలు వస్తున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎవరు ఉంటారో నిర్ణయించే క్రమంలో విరాట్ కోహ్లీకి అవమానం ఎదురయినట్టు సమాచారం.

గతకొంతకాలంగా టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తూ.. ఎన్నో మ్యాచ్‌లలో విజయపథం వైపు నడిపించాడు విరాట్ కోహ్లీ. కానీ కొన్నిరోజులుగా బీసీసీఐ.. విరాట్ కెప్టెన్సీ‌తో హ్యాపీగా లేదని సమాచారం. అందుకే విరాట్ కూడా టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా తప్పుకుంటున్నానని ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్, వన్డేకు మాత్రం తానే కెప్టెన్‌గా కొనసాగాలనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరే.

సౌత్ ఆఫ్రికా టెస్ట్‌కు సమయం దగ్గర పడుతుంది, విరాట్ కెప్టెన్సీ బీసీసీఐకు నచ్చలేదు.. అందుకే విరాట్ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని వారు ఎదురుచూశారు. అలా జరగకపోవడంతో విరాట్ ఒప్పుకోకపోయినా వారు ఓ పెద్ద స్టెప్ తీసుకున్నారు. దీంతో వారు సింపుల్‌గా విరాట్‌ను కాకుండా రోహిత్ శర్మను టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ప్రకటించారు. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story