Virender Sehwag birthday: క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని రోజు.. సెహ్వాగ్‌ను టాప్‌లో నిలబెట్టిన మూమెంట్..

Virender Sehwag (tv5news.in)
Virender Sehwag birthday: అన్ని ఆటలకంటే ఎక్కువగా అందరూ క్రికెట్‌నే ఇష్టపడతారు. అందుకే ఇతర ఆటల ప్లేయర్స్ కంటే క్రికెట్ ప్లేయర్స్‌కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలా క్రికెట్‌ను ఆట నుండి ఎమోషన్‌గా మార్చిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు వీరేందర్ సెహ్వాగ్. అందరూ ముద్దుగా పిలుచుకునే వీరూ. చాలాసార్లు టీమ్ ఇండియా స్కోర్‌ను ఇతర టీమ్‌లు అందుకోలేని స్థానంలో నిలబెట్టారు వీరూ. అందుకే ఆయన ఆటకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వీరూ పుట్టినరోజు నేడు.
వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌లో ఎన్నో మర్చిపోలేని మూమెంట్స్‌ను క్రికెట్ ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ అన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీరూ 293 రన్స్ మ్యాచ్. సాధారణంగా టెస్ట్‌లలో ఇంత స్కార్‌ను సాధించాలంటే ఏ ప్లేయర్‌కు అయినా కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. అలాంటిది వీరు ఒక్కరోజులో ఇంత స్కోర్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ క్రికెట్ హిస్టరీలో ఇదొక మర్చిపోలేని మూమెంట్.
అది 2009.. ఇండియా వెర్సస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టెస్ట్ అంటే ఎలాగో ప్లేయర్స్ స్లో అండ్ స్టెడీగానే ఆడతారు. కానీ అప్పుడే క్రీజ్‌లోకి వచ్చాడు వీరూ.. 254 బంతుల్లో 293 పరుగులు చేశాడు. అప్పటికీ ట్రిపుల్ సెంచరీ కోసం తానేం ఆశపడలేదు. స్కార్‌ను పెంచుదామనే ప్రయత్నంలో సిక్స్ కొట్టాడు. ఔట్ అయ్యాడు. అయినా సెహ్వాగ్‌కు, క్రికెట్ లవర్స్‌కు అదొక మరపురాని మ్యాచ్‌గా మిగిలిపోయింది.
వీరూ.. ఆటలోనే కాదు తన నిజ జీవితంలో కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వడ్‌గా ఉంటారు. అది నచ్చని కొంతమంది పలుమార్లు తనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించారు. అందులో భాగంగానే ఐపీఎల్ 2020 సమంయలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను తక్కువ చేస్తూ వీరు మాట్లాడిన మాటలు ఆయనకు చాలా నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. కానీ ఆయనపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా.. ఎంతమంది కొత్త ప్లేయర్స్ టీమ్‌లోకి ఎంటర్ అయినా వీరుకు మాత్రం అభిమానులు తగ్గలేదు.
ఆయన ఎప్పటికీ 'నవాబ్ ఆఫ్ నాజఫ్‌ఘడ్'.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com