డీజేలో పాటకి తాత చిందులు.. కర్రతో వచ్చిన బామ్మ!

డీజేలో పాటకి తాత చిందులు.. కర్రతో వచ్చిన బామ్మ!
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరుచూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరుచూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... తాజాగా ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ పంచుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పెళ్లి వేడుకలో భాగంగా ఓ తాత డీజేలో వస్తున్న పాటకు కుర్రాళ్లతో సమానంగా చిందేలేస్తుంటాడు.

అయితే కొద్దిసేపటికి ఆ తాత దగ్గరికి అతని భార్య కర్రతో వస్తుంది. అప్పటివరకు ఫుల్‌ జోష్‌తో డ్యాన్స్ చేస్తున్న ఆ తాత.. ఆ బామ్మను చూడగానే అక్కడినుంచి పారిపోతాడు. ఈ వీడియోని వీరూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోకి వీరు అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 'వయసు తాత్కాలికం.. కానీ భార్య చేతి కర్ర మాత్రం శాశ్వతం' అని రాసుకొచ్చాడు.



Tags

Next Story