సచిన్.. ఈ కరోనాను కూడా నువ్వు సిక్సర్‌‌‌గా బాదేస్తావ్..!

సచిన్.. ఈ కరోనాను కూడా నువ్వు సిక్సర్‌‌‌గా బాదేస్తావ్..!
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. ఇటీవల జరిగిన పరీక్షలో ఆయనకీ కరోనా పాజిటివ్‌‌గా తేలింది.

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. ఇటీవల జరిగిన పరీక్షలో ఆయనకీ కరోనా పాజిటివ్‌‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో సచిన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా వైరస్‌‌ను కూడా సిక్సర్ కొట్టాలని చమత్కరించారు అక్రమ్.. ఈ మేరకు ట్విట్టర్‌‌లో ఓ సందేశాన్ని పంపారు అక్రమ్.

16 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడుతూ ప్రపంచ మేటి బౌలర్లను ఎంతో తెగువతో ఎదుర్కొన్నావు. ఇప్పుడు ఈ కరోనాను కూడా సిక్సర్ బాదేస్తావని అనుకుంటున్నాను. త్వరగా కోలుకో మాస్టర్. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నావు కాబట్టి అక్కడి స్టాఫ్, డాక్టర్లతో కలిసి 2011 వరల్డ్ కప్ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుని నాకో ఫొటో పంపించు.. " అని వసీం అక్రమ్ ట్వీట్ చేశాడు. కాగా 2011 వరల్డ్ కప్ ను గెలిచి పదేళ్లయిన సందర్భంగా భారత క్రికెట్ వర్గాలు వేడుకలు జరుపుకుంటున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story