Wasim Jaffer: విరాట్‌కంటే రోహితే మంచి టెస్ట్ కెప్టెన్ అవ్వగలడు: మాజీ క్రికెటర్

Wasim Jaffer: చాలాకాలం పాటు ఇండియన్ క్రికెట్ టీమ్‌ను ముందుండి నడిపించాడు విరాట్ కోహ్లీ. తన సారథ్యంలో టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. అయితే కొన్నాళ్ల క్రితం విరాట్ కోహ్లీ స్థానాన్ని రోహిత్ శర్మకు ఇచ్చింది బీసీసీఐ. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. దీంతో ఓ మాజీ క్రికెటర్ రోహిత్ శర్మపై, విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్, విరాట్‌లకు చాలావరకు కామన్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే టీమిండియా కెప్టెన్సీ విరాట్ చేతి నుండి రోహిత్‌కు వచ్చినప్పుడు కూడా క్రికెట్ లవర్స్ అంతా ఆనందించారు. రోహిత్ ఒక మంచి కెప్టెన్ అవ్వగలడు అంటూ ప్రశంసించారు. తాజాగా ఇదే విషయాన్ని కాస్త వేరేలా చెప్పాడు మాజీ టీమిండియా టెస్ట్ ఓపెనర్ వాసిమ్ జాఫర్.
టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కంటే రోహితే బాగా ఆడగలడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వాసిమ్ జాఫర్. అంతే కాకుండా విరాట్‌తో పోలిస్తే రోహితే టెస్ట్‌లకు మంచి కెప్టెన్ అవ్వగలడు అని కూడా అన్నాడు. రోహిత్ ఎన్ని టెస్ట్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడో తెలీదు కానీ అతడి సారథ్యంలో టీమిండియా టెస్ట్ మ్యాచ్‌లు అన్నీ గెలుచుకుంటూ వెళ్తోంది అంటూ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com