WPL: బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ విజయం

WPL: బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ విజయం
156 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక్క వికెట్ నష్టంతో 14.2 ఓవర్లలో ఛేదించిన ముంబై జట్టు

WPLలో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. 156 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి ఛేదించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ వీరవిహారం చేయడంతో ముంబై ఇండియన్స్ పని సులువైంది. హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. నాట్ షివర్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 55 పరుగులు చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా 23 పరుగులు చేసింది. అంతకుముందు, టాస్ గెలిచిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ కు టోర్నీలో ఇది రెండో విజయం కాగా, ఆర్సీబీ జట్టుకు ఇది రెండో ఓటమి.

Tags

Next Story