WPL: RCB కి మరోసారి నిరాశే..

WPL: RCB కి మరోసారి నిరాశే..
X
ఆర్సీబీపై గుజరాత్‌ జెయింట్స్‌ 11 పరుగుల తేడాతో గెలిచి.. టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది

WPLలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్సీబీపై గుజరాత్‌ జెయింట్స్‌ 11 పరుగుల తేడాతో గెలిచి.. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది బెంగళూరుకు హ్యాట్రిక్‌ ఓటమి. ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన 18 పరుగులు మాత్రమే చేసింది. సోఫీ డివైన్‌ 66 పరుగులు చేయగా, ఎల్లీస్‌ పెర్రీ 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది.

చివర్లో హీథర్‌ నైట్‌ 30 పరుగులతో ధాటిగా ఆడినా జట్టును విజయాలతీరాలకు చేర్చలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ మూడు, అన్నాబెల్ రెండు, మాన్సీ జోషి ఒక వికెట్ పడగొట్టారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్.. ఓపెనర్‌ సోఫియా డంక్లీ 65 పరుగులు, హర్లీన్‌ డియోల్‌ 67 పరుగులతో అలరించడంతో గుజరాత్‌ రెండువందల పరుగుల మార్క్‌ను దాటింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మేఘన్‌ స్కట్, రేణుకా చెరో వికెట్ తీశారు.

Tags

Next Story