సన్‌రైజర్స్ అద్భుత విజయం

సన్‌రైజర్స్ అద్భుత విజయం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 69 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించి టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసింది. బెయిర్ స్టో సునామీ ఇన్నింగ్స్‌కు.. వార్నర్ ఆఫ్ సెంచరీ తోడవడంతో తొలుత సన్‌రైజర్స్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా కట్టడి చేశారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ తన స్పిన్ మాయతో పంజాబ్ వెన్ను విరిచాడు. ప్రారంభం నుంచే పంజాబ్ కష్టాల్లో పడింది. ఒక్క నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేసినా మిగతా వారి సహకారం కరువవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్‌ బెయిర్ స్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 6 మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. మరో వైపు పంజాబ్ వరుసగా నాలుగో ఓటమితో 6 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క గెలుపుతో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story