ASIA GAMES: టీమిండియా కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

ఆసియా క్రీడల్లో( ASIA GAMES) పోటీ పడే భారత క్రికెట్ జట్టు(indian team)కు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఈ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. ఈ టోర్నీలో చాలా మంది కొత్త ఆటగాళ్లకు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఐపీఎల్(IPL) స్టార్ రింకు సింగ్( Rinku Singh) తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించగా...ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) కూడా స్థానం దక్కించుకున్నాడు.
దేశవాళీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మల జట్టులోకి వచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చాడు. షాబాజ్ అహ్మద్‌కు కూడా చోటు దక్కించుకున్నాడు. యశ్ ఠాకూర్, సాయి కిషోర్, సాయి సుదర్శన్ జట్టులో చేరారు. ఈ గేమ్స్ జరిగే సమయంలో భారత్‍లో పరుషుల వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీంతో ప్రపంచకప్ కోసం టీమిండియాలో చోటు దక్కని ఆటగాళ్లతో జట్టును ఆసియా గేమ్స్‌కు పంపేందుకు బీసీసీఐ నిర్ణయించింది.
ఈ క్రీడల్లో బరిలోకి దిగే మహిళల జట్టు(womens team)ను కూడా బీసీసీఐ ప్రకటించింది. పూర్తి సామర్థ్యంతో ఉమెన్స్ టీం బరిలోకి దిగనుంది. తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి, బారెడ్డి అనూష చోటు దక్కించుకున్నారు. హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
తిలక్‌వర్మ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. 25 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 1236 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో 8 వికెట్లు కూడా తీశాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 480 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాధించాడు. తిలక్ 47 టీ20 మ్యాచ్‌ల్లో 1418 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 10 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ T20 స్కోరు 84 నాటౌట్. తిలక్ ప్రస్తుత ఆటతీరుతోనే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియా క్రీడలు 2023లో, T20 ఫార్మాట్‌లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆసియా క్రీడలకు భారత జట్టు: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్-కీపర్)
స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com