Yusuf Pathan Retirement : క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్.. !

టీంఇండియా అల్ రౌండర్ యూసఫ్ పఠాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తానూ అన్నీ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా యూసఫ్ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్‌కప్ తో క్రికెట్ లోకి అడుగుపెట్టిన యూసఫ్.. 2012 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.. భారీ హిట్టర్ గా పేరున్న యూసఫ్.. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ముంబై పై కేవలం.. 37బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఇక టీంఇండియా తరపున మొత్తం 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. ఇక 22టీ20లు ఆడాడు. యూసఫ్ పఠాన్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే..! అటు భారత ఫేసర్ వినయ్ కుమార్ కూడా కొద్దిసేపటి క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు. టీంఇండియా తరపున ఒక టెస్ట్, 31 వన్డేలు, 9టీ20లు ఆడాడు.. మొత్తం అన్నీ ఫార్మాట్లలో కలిపి 49 వికెట్లు తీశాడు.
I thank my family, friends, fans, teams, coaches and the whole country wholeheartedly for all the support and love. #retirement pic.twitter.com/usOzxer9CE
— Yusuf Pathan (@iamyusufpathan) February 26, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com