Yuzvendra Chahal: విడాకులు తీసుకోనున్న క్రికెట్ కపుల్..? సోషల్ మీడియాలో క్లారిటీ..

Yuzvendra Chahal: మామూలుగా క్రికెట్ వరల్డ్‌తో పోల్చుకుంటే సినీ పరిశ్రమలోనే విడాకులు ఎక్కువ. అంతే కాకుండా క్రికెట్ కపుల్స్ అందరూ చాలా క్యూట్‌గా ఉంటారని ఎప్పటికప్పుడు అభిమానులు వారిని ప్రశంసిస్తూ ఉంటారు. అలా అని క్రికెటర్స్ ఎవరూ ఇప్పటివరకు విడాకులు తీసుకోలేదని కాదు.. అలా విడాకులు తీసుకోని విడిపోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో మరో క్రికెటర్ చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్పిన్నర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యుజువేంద్ర చాహల్. ఓవైపు తన ఆటతో అందరినీ అలరిస్తూనే మరోవైపు తన ప్రవర్తనతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ఇక 2020లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు ఈ క్రికెటర్. అప్పటినుండి క్రికెట్ వరల్డ్‌లోని పాపులర్ కపుల్స్‌లో వీరు కూడా ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పటివరకు ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ధనుశ్రీ చాహల్ అని ఉండేది. కానీ ఇటీవల తను తన ఐడీ నుండి చాహల్ అనే పేరును తీసేసినట్టు నెటిజన్లు గమనించారు. దీంతో ఈ జంట మధ్య విభేధాలు వచ్చాయేమో అని అనుమానం మొదలయ్యింది. మరోవైపు చాహల్ కూడా 'కొత్త జీవితం లోడ్ అవుతోంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. ఒకేసారి వీరిద్దరి ప్రవర్తన చూస్తుంటే విడాకుల బాట పట్టనున్నారేమో అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది.
అందుకే 24 గంటలు తిరగకుండానే చాహల్.. తన సోషల్ మీడియాలో మరో పోస్ట్‌తో ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చాడు. 'మా రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఏ ఒక్క పుకారును కూడా నమ్మవద్దని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. దీనికి స్వస్తి పలకండి' అని చెప్పుకొచ్చాడు చాహల్. దీంతో చాహల్, ధనశ్రీ ఫ్యాన్స్ మనసు కాస్త కుదుటపడినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com