Crime : మేనేజర్ ను కొట్టి చంపిన యజమానులు

Crime : మేనేజర్ ను కొట్టి చంపిన యజమానులు
X

ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తిని కొట్టి చంపారు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జరిగింది. యూపీలోని ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో శివమ్ జోహ్రీ (32) మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీ బంకిమ్ సూరి, నీరజ్ గుప్తాలకు చెందినది. కంపెనీలో దొంగతనం జరిగినట్లు తెలియడంతో శివమ్ పై దొంగతనం ఆరోపణలు మోపారు యజమానులు. దీంతో అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆ దెబ్బల తీవ్రతకు శివమ్ మృతిచెందాడు. మంగళవారం అర్ధరాత్రి వైద్య కళాశాల ఆవరణలో శివమ్ మృతదేహాన్ని వదిలివెళ్లారు.

బుధవారం ఉదయం... మెడికల్ కాలేజీ పరిసరాల్లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విద్యుత్ ఘాతంతో శివమ్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించగా డెడ్ బాడీపై గాయాలను గమనించారు. దర్యాప్తు చేయగా.. శివమ్ ను కొట్టి చంపినట్లు కనుగొన్నారు. ఈ హత్యలో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలియనున్నట్లు తెలిపారు.

Tags

Next Story