Uttar Pradesh : గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్ కౌంటర్ లో మృతి

జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్నీలో జరిగింది. ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ తో పాటు గులాం అనే వ్యక్తి నిందితులుగా ఉన్నారు. వీరి కోసం పోలీసులు చాలా రోజులుగా గాలిస్తున్నారు. అసద్, అతని అనుచరులు ఝాన్సీలోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసుల కదలికలను గమనించిన అసద్ గ్యాంగ్ ఫైరింగ్ చేయడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో అసద్ తో పాటు అతని అనుచరులు ఎన్ కౌంటర్ లో మరణించినట్లు చెప్పారు. వీరి వద్ద అత్యాదునిక ఆముధాలు, లెటెస్ట్ సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com