Mumbai : మోడల్స్ ను వ్యభిచార కూపంలోకి దించుతున్న నటి అరెస్ట్

మోడల్స్ ను వ్యభిచారకూపంలోకి దించుతున్న భోజ్ పురి నటిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆరే కాలనీలోని రాయల్ పామ్ హోటల్‌లో సుమన్ కుమారి అనే నటి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితులను ట్రాప్ చేసేందుకు పోలీసులు ఓ నకిలీ కస్టమర్‌ను హోటల్‌కు పంపారు. అతనితో ఒక్కో మోడల్‌కు 50,000 నుంచి 80,000 రూపాయల ధరను మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు.
నటి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. సెక్స్ రాకెట్‌లో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి హై-ప్రొఫైల్ సెక్స్ రాకెట్లు పెరుగుతున్న ధోరణిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమన్ కుమారి (24) కస్టమర్లకు మోడల్స్ ను సరఫరా చేసేది. ఈ మోడల్స్ సినిమాల్లో కెరీర్‌ని సంపాదించుకోవడానికి ఆయా రాష్ట్రాలనుంచి ముంబైకి వచ్చారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న మోడల్స్ కు డబ్బు ఆశ చూపెట్టి సుమన్ కుమారి వ్యభిచారంలోకి దింపింది.
సుమన్ కుమారి అనేక భోజ్‌పురి చిత్రాలలో పనిచేసింది. లైలా మజ్నుతో పాటు, ఆమె బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి వంటి భోజ్‌పురి కామెడీ షోలను కూడా చేసింది. దీనితో పాటు, నటి బూమ్ OTT ఛానెల్‌లో కూడా పనిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com