kidnap : తల్లి ఒడికి చేరిన రెండు నెలల చిన్నారి

అఫ్జల్‌గంజ్‌లో కిడ్నాపైన రెండు నెలల చిన్నారి సేఫ్‌గా తల్లి ఒడికి చేరింది. కిడ్నాపైన గంటల వ్యవధిలోనే పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. పసిపాపను తల్లి దగ్గరకు చేర్చారు. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్ ప్లేస్‌లో రెండు నెలల చిన్నారితో కలిసి ఓ మహిళ నిద్రించింది. తెల్లవారు జామున బిడ్డను గుర్తు తెలియని మహిళ, ఓ యువకుడు చిన్నారిని ఎత్తుకెళ్లారు. నిద్రలేచి చూసే సరికి బిడ్డ కనిపించక పోవడంతో ఆస్పత్రి అంతా వెతికారు. ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సీసీటీవీతో పాటు పక్కనే ఉన్న అఫ్జల్ గంజ్ బస్టాప్ సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఓ మహిళ, ఓ యువకుడు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను ఉప్పుగూడలో పోలీసులు పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com