బ్యూటీ పార్లర్ కు వద్దన్న భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య..!

బ్యూటీపార్లర్ కు వెళ్లవద్దన్నందుకు ఉరి వేసుకుని చనిపోయింది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. రీనా యాదవ్ ( 34) అనే మహిళ గురువారం బ్యూటీపార్లర్ కు వెళ్లడానికి రెడీ అయింది. ఆమె భర్త బలరాం.. పార్లర్ కు వెళ్లవద్దన్నందుకు ఆవేశానికి లోనై, ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
"రీనా యాదవ్ ను బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండా అడ్డుకున్నాడన్న కోపంతో ఆవేశానికి లోనయి ఉరివేసుకుని చనిపోయిందని ఆమె మామ చెప్పాడు. పోస్ట్ మార్టమ్ నిర్వహించి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం" అని పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ ఉమా శంకర్ యాదవ్ చెప్పారు. పెళ్లయి 15ఏళ్లు అయినా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com